జోక్ చేశా.. విలాస‌వంత‌మైన జీవితాన్ని ఎందుకు వ‌దులుకుంటా : రాహుల్ రామ‌కృష్ణ‌

-

ఇక మీద తాను సినిమాలు చేయ‌న‌ని.. న‌ట‌న‌కు దూరంగా ఉంటాన‌ని క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ త‌న ట్విట్ట‌ర్ లో చేసిన పోస్టు ఫుల్ వైర‌ల్ అయింది. 2022 త‌న న‌ట‌కు చివ‌రి ఏడాది అనే అర్థం వ‌చ్చేలా క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే ఈ పోస్టు పై శ‌నివారం కమెడియ‌న్ రాహుల్ రామ కృష్ణ స్పందించాడు. త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా మ‌రో పోస్టు పెట్టి ఇలా క్యాప్షన్ పెట్టాడు. అంద‌రూ ఫుల్ అయ్యారు. అధిక రెమ్యున‌రేషన్లు, విలాస‌వంత‌మైన జీవితాన్ని ఎందుకు వ‌దులుకుంటాను అని అన్నాడు.

అలాగే త‌న రిటైర్ మెంట్ సంద‌ర్భంగా త‌న‌ను అభినందించడానికి త‌న‌కు చాలా మంది ఫోన్స్ చేస్తున్నార‌ని కామెంట్ పెట్టాడు. ఇది మొత్తం తాను న‌మ్మ‌లేక పోతున్నాన‌ని అన్నాడు. అలాగే చివ‌రికి ఒక స్మైలీ ఇమోజీని కూడా జోడించాడు. కాగ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ నుంచే రెండు విభిన్న కోణంలో ట్వీట్స్ రావ‌డం పై నెటిజ‌న్లు క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. కామెడీ సినిమాల‌లోనే చేయాల‌ని.. ట్విట్ట‌ర్ లో కాద‌ని పలువురు నెటిజ‌న్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. అయితే తాను న‌ట‌కు దూరంగా ఉంటాన‌నే ఫోస్టు ఎందుకు పెట్టాడో దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version