దుబ్బాక ధమాకాతో, హూజూరాబాద్ ఓటమితో హుజూర్ తలపొగరు తగ్గిందని… కేసీఆర్ కష్టాలు మొదలయ్యాయని అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీ సారథ్యంలో కేంద్రంలో బాధ్యతాయుత సర్కార్ ఉందని ఆయన అన్నారు. దేశంలో అత్యంత అవినీతి సర్కార్ టీఆర్ఎస్ సర్కారే అని విమర్శించారు. కరోనాతో అమెరికా, ప్రాన్స్, ఇటలీ దేశాలు తీవ్రంగా నష్టపోతుంటే… మోదీ సారథ్యంలోని భారత్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోందని ఆయన అన్నారు. మనం అంతా మాస్కులు లేకుండా ఇక్కడ ఉన్నామంటే 190 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన మోదీ సర్కార్ కారణం అన్నారు.
దుబ్బాక ధమాకాతో హుజూరాబాద్ ఓటమితో కేసీఆర్ కష్టాలు మొదలయ్యాయి: జేపీ నడ్డా
-