Jr NTR : ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో NTR ఎమోషనల్ స్పీచ్

-

అభిమానులకు కుటుంబ సభ్యులుగా భావించే హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరున్నారు. వారి జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ ప్లేస్​లో ఉంటారు. అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటారు. తాజాగా తన ఫ్యాన్స్​ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. . ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌ అక్కడ అభిమానులతో మాట్లాడారు.

‘‘”మీరు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. దానికి రెట్టింపు ప్రేమ నాకు మీపై ఉంది. కాకపోతే నేను దాన్ని చూపించలేకపోతున్నా. మీరందరూ స్టేజ్‌పై ఉండాలి. నేను మీలా కూర్చొవాలి. రక్తసంబంధం కంటే గొప్పబంధం మనది. మీరందరూ నా సోదరులతో సమానం. మీ ప్రేమకు, అభిమానానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే.. ఈ అభిమానం కోసమే పుట్టాలని కోరుకుంటాను”’’ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోను తారక్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తారక్‌ 30వ సినిమాగా (#NTR30) రానుంది. ఈ చిత్రంలో ఆయన సరసన బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటించనున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version