తారక్‌కు ఇష్టమైన బాలీవుడ్ దర్శకులు వీళ్లే..

-

విజనరీ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించారు. ఇరువురు హీరోలు తమ నటనతో ప్రేక్షకులను మూడు గంటల పాటు కట్టి పడేయడంతో పాటు కన్నీరు పెట్టించారని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషించిన విధానం చూసి జనాలు కన్నీరుగారుస్తున్నారు. ప్రాణం పెట్టి తారక్ సినిమా చేశాడని కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఫిల్మ్స్ పైన భారీ హైప్ క్రియేట్ అయింది.

రామ్ చరణ్ తన తర్వాత సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సైతం అదే తోవలో నడుస్తున్నారు. తారక్ తన నెక్స్ట్ చిత్రం కొరటాల శివతో చేస్తున్నారు. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నారు. ఇకపోతే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో తారక్ మాట్లాడిన తీరు చూసి ముంబై మీడియా ఆశ్చర్యానికి గురైంది. చాలా యాక్టివ్ గా తారక్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడని, అడిగిన ప్రశ్నలకు టకటక సమాధానిలచ్చేశారని అనుకున్నారు.

ఈ క్రమంలోనే తారక్ కు ఇష్టమైన బాలీవుడ్ దర్శకులెవరో అని కనుగొనే ప్రయత్నం చేసింది ఓ బీ టౌన్ మీడియా సంస్థ. కేవలం హిందీ భాషలో సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని తారక్ ను అడగగా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు.

రాజ్ కుమార్ హిరాణితో చిత్రం చేస్తానని, ఆయన ఫిల్మ్స్ లో ఎమోషన్స్ చాలా ఉంటాయని, వాటిని వినోదాత్మకంగా తీర్చిదిద్దుతారని వివరించారు. ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్ చిత్రాల్లో సంజయ్ లీలా భన్సాలీ చేసే సినిమాలంటే చాలా ఇష్టమని తారక్ తెలిపారు. చూడాలి మరి భవిష్యత్తులో తారక్ సంజయ్ లీలా భన్సాలీతోనో లేదా రాజ్ కుమార్ హీరానీతోనో చిత్రం చేస్తారో లేదో..

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version