ధాన్యం కొనుగోలులో మరోసారి కేంద్రం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పార్లమెంట్ లో కూడా ఈ విషయాన్ని తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తారు. ఇదిలా ఉంటే ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని చెప్పింది. కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పార్లమెంట్ కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అసరాల రీత్యా రాష్ట్రాలే బాయిల్డ్ రైస్ సేకరించుకోవాలని పార్లమెంట్ కు తెలిపారు. కేంద్రం ఇక బాయిల్డ్ రైస్ సేకరించబోమని గత ఖరీఫ్ లోనే చెప్పినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.