జూన్ 4 శనివారం ఏ రాసి వారికి మంచి లాభాలు ఉన్నాయంటే?

-

జూన్ 4 శనివారం రాశి ఫలాలు.. ఏ రాశులకు ఈరోజు శుభ పరినామాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము.

మేషరాశి

పెద్దలు చెప్పిన విషయాన్ని పక్కన పెట్టకుండా వినండి..మంచి చేకూరుతుంది. ధనలాభం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.నలుగురికి భోజనం పెట్టిస్తే మంచిది.

వృషభ రాశి

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ఆశీస్సులు లభిస్తాయి . హనుమాన్ చాలీసా చదవాలి..దైవదర్శనాలు చేయాలి..

మిథున రాశి

కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఒకరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. సూర్యాష్టకం చదివితే ఇంకా బాగుంటుంది..ఈరోజు ఆర్థిక ఫలితాలు లేవు..జాగ్రత్త వహించాలి.

కర్కాటక రాశి

ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారాలలో ఊహించని ఫలితాలు వస్తాయి. అవి మీకు సంతోషాన్నికలిగిస్తాయి. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి..పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.. లక్ష్మి దేవిని పూజిస్తె మంచిది.

సింహ రాశి

అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన కొన్ని ఫలితాలను పొందడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. చేపట్టిన కార్యాలను వాయిదా వెయ్యకుండా చెయ్యాలి..దూర ప్రయాణాలు..

కన్య రాశి

కొత్త ఆలోచనలు చేసి వాటిని ఆచరణలో పెడతారు. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. బంధు,మిత్రులను ఆదరిస్తారు. శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు అండదండలు లభిస్తాయి.ఏదైనా చేసేముందు ఇష్ట దైవాన్ని తలుచుకుంటే మంచిది.

తులా రాశి

బంధు,మిత్రులతో మాట పట్టింపులకు పోవద్దు. చెడు సావాసాలు చేయరాదు. కీలక విషయాల్లో అశ్రద్ధగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు.మనసులో మాట బయటకు చెప్పాలి..లేదంటే సమస్యలు తప్పవు..

వృశ్చిక రాశి

కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు.కొన్ని ఆటంకాలు కలిగిన భయపడకండి.. అంతా విజయం కలుగుతుంది.

ధనస్సు రాశి

ఆర్థిక లాభాలు బాగుంటుంది. కొత్త రుణాలు ఫలిస్తాయి.నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దుర్గామాత దర్శనం శుభప్రదం.

మకర రాశి

చేపట్టిన కార్యాలలో ఆటంకాలు.శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు..

కుంభ రాశి

అనుకున్న పనులు విజయవంతం..అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్పలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి..దైవదర్శనాలు, దూర ప్రయాణాలు..

మీన రాశి

ప్రారంభించిన పనులలో ముందుకు వెళతారు. ఆర్ధిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలుగుతాయి..దైవదర్శనాలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version