తెలంగాణాలో BRS పని అయిపోయిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే కారణం అని చెప్పుకోవాలి. ఏ పార్టీలో నేత జాయిన్ అవ్వాలన్నా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను చూసుకుంటున్నారు. ఈ మధ్యనే BRS నుండి వెళ్లిపోయిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు జూపల్లి కృషారావు లలో ఇప్పటికే పొంగులేటి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగా, జూపల్లి మాత్రం షెడ్యూల్ ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ లో చేరడానికి ఢిల్లీ వెళ్లారు. కానీ తాను వెళ్లే సమయానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వివిధ కార్యక్రమాలతో బిజీ గా ఉండడం వలన అపాయింట్మెంట్ దొరకలేదని తెలిసింది. చాలా సేపు వెయిట్ చేసినా వీలు పడకపోవడంతో జూపల్లి నిరాశగా తిరిగి వచ్చేశారని సమాచారం. అయితే మల్లిఖార్జున ఖర్గే ఎప్పుడు ఫ్రీ గా ఉంటారు అన్నది చెబుతామని ఏఐసీసీ చెప్పడంతో … దాదాపుగా రేపు ఉదయం మల్లిఖార్జున ఖర్గే సమక్షములో కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు జూపల్లి కృష్ణారావు.
జూపల్లి కృష్ణారావుకు నిరాశ, దొరకని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే అపాయింట్మెంట్ … !
-