బీఆర్‌ఎస్‌పై జూపల్లి కృష్ణ రావు సంచలన వ్యాఖ్యలు

-

 

ఈరోజు జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణ రావు పాల్గొని అక్కడ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల లక్ష్య సాధన కోసం ప్రజలను సంఘటితం చేస్తామని వెల్లడించారు. తనకు ఉద్యమాలు కొత్త ఏమి కాదని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించాక ముందే కరెంట్ బిల్లుల రద్దు కోసం 15 రోజులపాటు ఉపవాస దీక్ష చేస్తూ జైల్లో గడిపానని, అనంతరం తన పోరాట పటిమను గుర్తించిన వైయస్సార్ 12 వందల కోట్లు విద్యుత్ బిల్లులను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేసినట్లు తెలిపారు ఆయన. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2 లక్షల ఎకరాల విస్తీర్ణం నుంచి 3 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెంచేందుకు ఎంతగానో కృషి చేసినట్లు గుర్తు చేశారు జూపల్లి. దాని ఫలితంగానే వనపర్తి ప్రాంతానికి కూడా సాగునీటిని తరలించేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు, దాని ఫలితంగానే మంత్రి నిరంజన్ రెడ్డికి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు వచ్చిందన్న విషయాన్ని మంత్రి గుర్తించుకోవాలని వ్యక్తపరిచారు. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో తన ఓటమికి ఎంతమంది పనిచేశారో తెలుసునన్నారు. పాలమూరు ప్రాజెక్టు పనులను ఆపాలని చెప్పిన వ్యక్తిని, తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులనే చేరదీసి అందలమెక్కించారని కోపపడ్డారు. బ్రిడ్జి నిర్మాణంలో ఐదు లక్షల పెండింగ్ బిల్లు కోసం ప్రభుత్వం రూ. 26 లక్షలు ఎలా చెల్లించారో చెప్పమని ప్రశ్నించారు జూపల్లి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version