కేసీఆర్ ఢిల్లీ టూర్ ను సడెన్ గా క్యాన్సల్ చేసుకోవడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ వివిధ రాజకీయ నాయకులతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసినా డీల్ కుదరలేదని విమర్శించారు. ప్రధాని మోదీ 26 తేదీన వస్తే గౌరవ సూచకంగా ముఖ్యమంత్రులు కలుసుకోవాలని… గతంలో మీరు ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోలేదని.. ఈసారి అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారని అందుకే వచ్చాడని కేఏ పాల్ అన్నారు. పార్థసారధికి రాజ్యసభ సీటును అమ్ముకున్నారని… నాకు ఇన్ఫర్మేషన్ ఉందని పాల్ అన్నారు. పార్థసారధి గారి అక్రమాలను నేను బయటపెడుతున్నానని వచ్చాడని ఆయన అన్నారు.