ఈ రోజు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ రాజమండ్రి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రజలపై ప్రేమ సమాజం మీద బాధ్యతతో పవన్ రాజకీయాల్లోకి రాలేదు, బీజేపీకి మద్దతు గా ఉండడానికి మాత్రమే జనసేన పార్టీ ఉందంటూ మాట్లాడారు కే ఏ పాల్. మీరందరూ చూస్తూ ఉండండి 2024 ఎన్నికల అనంతరం ఖచ్చితంగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడు అంటూ కామెంట్ చేశాడు కే ఏ పాల్. ఇక జనసేన పార్టీ స్థాపన, కార్యాచరణ అంతా కూడా చిరంజీవి కనుసన్నల్లోనే జరుగుతోందంటూ కే ఏ పాల్ తెలియచేశారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి లు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి కుట్ర చేస్తున్నారని కే ఏ పాల్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పవన్ , చిరంజీవి లపై పోటీ చేస్తానన్నారు.
చిరంజీవి , పవన్ లు ప్రజలను మోసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు : కే ఏ పాల్
-