బంగాళాఖాతంలో కాసేపటి క్రితమే భారీ ప్రమాదం జరిగింది. మయన్మార్ దేశం రాఖైన్ నుండి దాదాపుగా 50 మంది రోహింగ్యా శరణార్థులు మలేసియా మరియు ఇండోనేసియా దేశాలకు వెళ్లి తమ జీవనాన్ని కొనసాగించడానికి పడవలో సముద్రప్రయాణం సాగించారు. కానీ సముద్రం మధ్యలో అనుకోకుండా ప్రమాదం సంభవించడంతో పడవను కంట్రోల్ చేయలేక పోవడంతో అక్కడికక్కడే తిరిగి పడిపోయి సముద్రంలోనే మునిగిపోయింది. ఈ ఊహించని ప్రమాదానికి పడవలో ఉన్న 50 మంది రోహింగ్యాలు భయంతో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి ప్రయత్నించగా, దురదృష్టవశాతూ 17 మంది జలసమాధి అయిపోయారు. ఇంకా వీరిలో 8 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా ఆచూకీ తెలియని వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను చేపట్టారు. మరి వీరి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.