ప్రజాశాంతి పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావాలి, ప్రజలకు సాధ్యమైనంత సాయం చేయాలని తాపత్రయపడుతున్న లేటెస్ట్ పొలిటికల్ లీడర్ కే ఏ పాల్.. ఇప్పుడున్న మహామహా రాజకీయనాయకుల ఆలోచనలకు అందని విధంగా ఎనాలిసిస్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ రోజు కే ఏ పాల్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. ముఖ్యంగా టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల మధ్యన మిగిలిన ఉన్న సమయాన్ని తన స్వార్ధం కోసం ఏ విధముగా అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని కామెంట్ చేశాడు. చంద్రబాబుకు తన కొడుకును సీఎంగా చేయాలన్నది బలంగా నాటుకుపోయింది, అందుకోసం భారీ ప్లాన్ వేస్తున్నాడని కె ఏ పాల్ చెప్పడం రాజకీయనాయకులను ఆలోచనలో పడేసింది. అంతే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెడు చేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడడని, రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పై హత్య యత్నం చేయించి ఆ కేసును సీఎం జగన్ పైన వేసి ఆ సానుభూతితో ప్రజల మనసును గెలుచుకోవాలని పన్నాగం పన్నుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కే ఏ పాల్: చంద్రబాబు నుండి పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని… !
-