నెక్ట్స్‌ సీఎం నేనే.. 50 వేల మెజార్టీతో గెలుస్తున్నా : కేఏ పాల్‌

-

మునుగోడు ఉప ఎన్నికలో తాను 30 నుంచి 50 వేల ఓట్ల ఆధిక్యంతో గెలవబోతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తాను ఇక్కడి ప్రజల గుండెల్లో ఉండిపోయానని అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు వివరించారు. ఇతర స్వతంత్ర అభ్యర్థులు 27 మంది తనకు మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. భారతీయ జనతాపార్టీ ఓడిపోతుందని తెలిసి తన ప్రియశిష్యుడైన జేపీ నడ్డా మునుగోడు సభను రద్దుచేసుకున్నారని వివరించారు. తాను గెలిస్తే బీజేపీ గెలిచినట్లేనని, తన గెలుపునే వారి గెలుపుగా ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రజలు తనపై ఎనలేని ప్రేమ చూపారని, ఉప ఎన్నిక లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి తానే తరువాయి ముఖ్యమంత్రినని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

మునుగోడు ఉప ఎన్నికలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు ఉంగరం గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. లక్షా 10 వేల ఓట్లు ఉంగరం గుర్తుకు పడ్డాయని.. తాను 50 వేల మెజారిటీతో గెలవబోతున్నానని మీడియా సమావేశంలో ప్రకటించుకున్నారు. తన గెలుపు రాష్ట్ర, దేశ రక్షణకు తొలి మెట్టని పేర్కొన్నారు. సీఎం కేసీఅర్ (KCR) పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడ్డారని, టీఆరెఎస్ (TRS) నేతలు తనపై మూడు సార్లు దాడికి యత్నించారని పాల్ ఆరోపించారు. తన లాంటి యూత్‌కు కేసీఆర్ ఇచ్చే మెసేజ్ ఇదేనా ? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version