సుకుమార్ తర్వాత సినిమా ప్రచారం నిజమేనా.!!

-

అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.‘పుష్ప’ సినిమా ముందు టాలీవుడ్, మలయాళం పరిశ్రమను మాత్రమే టార్గెట్ చేసి తీశారు. కాని తర్వాత  హింది, కన్నడ మరియు తమిళంలో కూడా విడుదల చేసారు. మిగిలిన భాషలు ఏమోగాని,  ఈ సినిమా హిందీలో మాత్రం ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి.చాలా మంది క్రికెటర్లు కూడా పుష్ప మ్యానరిజంతో ఎన్నో వీడియోలు చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు సుకుమార్ టీమ్ రెండో పార్ట్ మీద దృష్టి పెట్టి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ వుండేలా స్క్రిప్ట్ లాక్ చేసుకున్నారు. ప్రస్తుతం సుక్కు ఈ సినిమా మీదనే ఫుల్ కన్సెంట్రేషన్ చేసి వున్నాడు. నెక్స్ట్ సినిమా పై అస్సలు ఆలోచన లేదు.

కాని తాజాగా డైరెక్టర్ సుకుమార్ ను ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి  కలిసిన ఫొటో వైరల్ గా మారింది. ఇక మీడియా దీనిపై వీరు పాన్ ఇండియా చిత్రం కోసం వీరు ముగ్గురూ వర్క్ చేయనున్నారు అనే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అసలు వారు ఎందుకు కలిశారో  వారి నుండి ప్రకటన వస్తేనే తెలుస్తుంది. అప్పటిదాకా ఈ రూమర్స్ వస్తూనే ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version