వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నేడు విజయవాడ కోర్టుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, 80 మంది వైసీపీ కార్యకర్తలు హాజరు కానున్నారు. అటు విజయవాడ కోర్టుకు హాజరు కానున్న అవినాష్ రెడ్డి తో పాటు వివేకా హత్య కేసులో నిందితుడు దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి కూడా హాజరు కానున్నారు.
విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు అవినాష్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి ఇద్దరూ హాజరుకానున్నారన్న మాట. ఇక 2015 మేలో తొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన కేసులో అవినాష్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి తో పాటు 80 మందిపై పోలీస్ కేసు నమోదు అయింది. పులివెందుల నుంచి వెళ్లిన అవినాష్ రెడ్డి, వైసిపి కార్యకర్తలు… చంచలగూడ జైలు నుంచి విజయవాడకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వెళ్లారు.