తెదేపా నేత, రాజం పేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరనున్నారు. జమ్మలమడుగు, రాజంపేట నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపుపై చెలరేగిన వివాదం ఏపీ సీఎం వద్దకు చేరాయి. దీంతో చంద్రబాబుతో భేటీకి రావాల్సిందిగా మేడాను ఆహ్వానించారు. కడప జిల్లా నేతలందరు హాజరుకాడా… మేడా గైర్హాజరు అయ్యారు. దీంతో మేడా మల్లికార్జున రెడ్డి, తన సోదరుడు మేడా రఘునాథ రెడ్డి తో కలిసి వైసీపీలో చేరనున్నట్లు వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది.
ఈ విషయమై స్పందించిన ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ… టీడీపీలో చేరినవెంటనే మేడాకు చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారనీ, ఆయన తండ్రికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా నియమించారనీ, నియోజకవర్గంలో ప్రభుత్వం తరుఫున ఏ పని కావాలన్నా చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడేమో పార్టీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. కాగా మేడాకు పోటీగా రెడ్ బస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ రాజు పేరును మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే.