చంద్రబాబు ఒక కాపీ క్యాట్ : కాకాణి

-

రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోంది అని మాజీ మంత్రి కాకాణి అన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. వై. ఎస్.ఆర్ . జిల్లాలో నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసింది. అనధికరకంగా 150 మంది రైతులు ఇప్పటి వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయి.

రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని.. ఆత్మహత్యల విషయంలో కూడా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో చనిపోయిన రైతు కుటుంబాలకు జగన్ పరిహారం అందించారు. చంద్రబాబు ఒక కాపీ క్యాట్ లాంటివారు. రుణమాఫీ పేరుతో అప్పుడు రైతులను మోసం చేసారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తానని ప్రకటించి.. వారిని కూడా మోసం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలను కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారు. గతంలో ఆందోళన చేస్తున్న రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర బాబుది. రాజధాని నిర్మాణం మీద ఉన్న శ్రద్ద.. రైతుల ప్రాణాల మీద చంద్రబాబుకి లేదు. తనకు వాట్సప్ లో.. హాయ్ పెడితే రైతుల నుంచి ధాన్యం కొంటానని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. ఆయనకు ఎన్ని మెసేజ్ లు పెట్టినా స్పందన లేదు. రైతులు తక్కువ ధరకే ధాన్యం అంకుకుంటున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని చంద్రబాబు ప్రతి సభలోనూ చెప్పారు. ఇప్పుడు చార్జీలు పెంచుతున్నారు అని కాకాణి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version