కళ్యాణ్ రామ్ “బింబిసార” ఫస్ట్ సాంగ్ రిలీజ్

-

నందమూరి కళ్యాణ్‌ రామ్.. మంచి మాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ… దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్‌ రామ్. హీరోగానే కాకుండా… ఓ నిర్మాతగా బాగా సక్సెస్‌ అయ్యారు కళ్యాణ్‌ రామ్‌. అయితే… ప్రస్తుతం టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా ”బింబిసార” అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే..  ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా బుధవారం ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు.” భువిపై ఎవడూ కనివిని ఎరుగని అద్భతమే జరిగెనే… దీవిలో సైతం కథగా రానీ మిధి లిలే వెలిగెనే” అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను కాలభైరవ అద్భుతంగా పాడారు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version