అక్టోబర్ 1 నుంచి కళ్యాణనస్తు, YSR షాదీ తోఫా లను అమలు చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున. మానిఫెస్టోని మేము బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చూస్తామని.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ మ్యానిఫెస్టోని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 98% అమలు చేశామని.. తాజాగా కళ్యాణమస్తు, పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చామని వెల్లడించారు.
దీని వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపయోగమని.. ఏ ఇంటికి వెళ్లినా జగన్ వల్ల మాకు ఎంతో ప్రయోజనం అని చెబుతున్నారన్నారు. అక్టోబర్ ఒకటి నుండి కళ్యాణనస్తు, వైయస్సార్ షాదీతోఫాలను అమలు చేస్తామని.. ఎస్సీల్లో కులాంతర వివాహం చేసుకునే వారికి లక్షా ఇరవై వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు మేరుగ నాగార్జున. ఎస్టీలకు కూడా లక్ష ఇరవై రూపాయలు ఇవ్వబోతున్నామని.. బీసీలకు 35 చంద్రబాబు ఇస్తే మేము 50 వేలు ఇస్తున్నామని ప్రకటించారు. వికలాంగులకు లక్షా 50 వేలు ఇస్తున్నామని.. జగన్ కు ఈ అణగారిన కుటుంబాల కోసం ఎంతగా పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు మేరుగ నాగార్జున.