హీరోయిన్ సిమ్రాన్ తో కమల్ హాసన్ ప్రేమాయణం..? ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!

-

మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్స్ కి అందం ఉంటె అభినయం ఉండదు..అభినయం ఉంటె అందం ఉండదు..కానీ అందం మరియు అభినయం రెండు ఉన్న హీరోయిన్స్ అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు..ఆ అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరే సిమ్రాన్ గారు..తెలుగు మరియు తమిళం బాషలలో ఈమె హవ్వా ఏ స్థాయిలో నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు లో ఈమె నటించిన నరసింహ నాయుడు,సమరసింహా రెడ్డి, కలిసుందాం రా, నువ్వు వస్తావని, సీతయ్య ఇలా ఒక్కటా రెండా..చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క ఆర్టికల్ సరిపోదు..అన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

దాదాపుగా ప్రతి స్టార్ హీరో సరసన ఈమె నటించింది..తెలుగులో కంటే ఈమె ఎక్కువగా తమిళం లో నటించింది..ఎంతో మంది హీరోలతో నటించినప్పటికీ సిమ్రాన్ గురించి ఎలాంటి రూమర్స్ రాలేదని మనం అనుకుంటూ ఉంటాం..కానీ తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ తో ఈమె నడిపిన ప్రేమాయణం అప్పట్లో సెన్సషనల్ టాపిక్ గా నిలిచింది.

ఇక అసలు విషయానికి వస్తే కమల్ హాసన్ తో సిమ్రాన్ కలిసి చాలా సినిమాల్లోనే నటించింది..వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ పంచ తంత్రం సినిమా అప్పట్లో తెలుగు మరియు తమిళం లో పెద్ద హిట్..ఈ సినిమా సమయం లోనే వీళ్లిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారట..కొంతకాలం డేటింగ్ కూడా చేసారు..అప్పట్లో ప్రైవేట్ పార్టీలకు కూడా ఇద్దరు జంటగా కలిసి భలే తిరిగేవారు..అయితే కమల్ హాసన్ కి అప్పటికే గౌతమీ అనే ఆమెతో రిలేషన్ నడిపాడు అనే విషయం సిమ్రాన్ కి తెలీదట..ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమె కమల్ హాసన్ కి బ్రేకప్ చెప్పేసి ఆ తర్వాత ఆయన మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదట.

ఇది జరిగిన చాలా కాలం తర్వాత ఆమెకి దృశ్యం సినిమా కమల్ హాసన్ తో నటించే ఛాన్స్ వచ్చినా కూడా వదులుకుందట..కమల్ హాసన్ తనని అవసరానికి వాడుకొని నమ్మించి మోసం చేశాడంటూ ఆమె అప్పట్లో తన సన్నిహితులతో చెప్పుకొని బాధపడేది అట..వీళ్లిద్దరి మధ్య ఇంత జరిగింది అనే విషయం తమిళ ప్రేక్షకులకు తప్ప తెలుగు వారికి తెలియకపోడం గమనార్హం.

ఆ తర్వాత సిమ్రాన్ దీపక్ బగ్గ అనే అతనిని పెళ్ళాడి ఇద్దరు కుమారులకు జన్మనించింది..ఇక ఆమె ప్రస్తుత కెరీర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే..ఆమెకి నాలుగు పదుల వయస్సు వచ్చేసరికి సినిమాలలో హీరోయిన్ వేషాలు అయితే ఇచ్చేందుకు ఏ నిర్మాత సిద్ధంగా లేదు కానీ..క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి మరియు విలన్ రోల్స్ కి సిమ్రాన్ కు మంచి డిమాండ్ ఏర్పడింది..ప్రస్తుతం ఆమె ప్రశాంత్ హీరో గా నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘అందదున్’ సినిమాలో విలన్ గా నటిస్తుంది..ఆమెకి విలన్ రోల్స్ వెయ్యడం కొత్తేమి కాదు..హీరోయిన్ కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ప్రశాంత్ హీరో గా నటించిన ‘పార్థేన్ రాసితాన్’ అనే సినిమాలో నెగటివ్ రోల్ చేసింది..ఆ తర్వాత శివకార్తికేయన్ హీరో గా నటించిన ‘సీమ రాజా’ లో కూడా విలన్ గా నటించింది..ఇప్పుడు మూడవసారి ముచ్చటగా మరోసారి నెగటివ్ రోల్ లో కనిపించబోతుంది..హిందీ లో భారీ హిట్ గా నిలిచినా ఈ సినిమా తమిళం లో ఎలా ఆడబోతుందో చూడాలి..తెలుగు లో అదే సినిమాని నితిన్ ని హీరో గా పెట్టి ‘మాస్ట్రో’ అనే సినిమాని తీశారు..ఇది నేరుగా OTT లోనే విడుదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version