వీళ్లను నమ్మితే సంక్షేమ పథకాలన్నీ రద్దే : సీఎం కేసీఆర్

-

తెలంగాణలో రాజకీయ రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్న వేళ.. రాష్ట్ర రాజకీయం అక్కడ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నేడు టీఆర్‌ఎస్‌ మునుగోడు ప్రజాదీవెన పేరిట బహిరంగ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఆగదని తెల్చిచెప్పారు. తెలంగాణ రైతుల అప్పులన్నీ తీరిపోయి.. ఆయన డబ్బులు ఆయనకు వచ్చే వరకు రైతు బంధు ఆగదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయం స్థిరీకరణ జరిగితే గ్రామాలు బాగు పడతాయని, పంటలు పండితే ప్రజలు బతుకుతారన్నారు సీఎం కేసీఆర్. ఊరికే తమాషాగా ఇలాంటివి చెయ్యడం లేదని, ఇక్కడ లక్ష మందికి రైతు బంధు వస్తుందన్న సీఎం కేసీఆర్.. 8 వేల మందికి వికలాంగుల పెన్షన్ వస్తుందన్నారు.

40 వేల మంది నెలకు రూ.2 వేల పెన్షన్ వస్తోందని, ఇవన్నీ బంద్ కావాలనా? వీళ్లు ఇస్తారా? ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా? వీళ్లను నమ్మితే సంక్షేమ పథకాలన్నీ రద్దు అవుతాయన్నారు సీఎం కేసీఆర్. ఎందుకు ఇస్తున్నారయ్యా? మా గుజరాత్‌లో రూ.600 ఇస్తుంటే ఓట్లు వెయ్యడం లేదా? మీరు రూ.2 వేలు ఎందుకు ఇస్తున్నారు? డబ్బులు వృధా చేస్తున్నారు? అని ఇదే జగదీశ్వర్‌రెడ్డితో అన్నారు. ఓటు ఎవరికివ్వాలి? ఇవాల పోటీ చేస్తోంది టీఆర్ఎస్ ఒక్కటి కాదు. ప్రగతి శీల శక్తులం ఏకమయ్యాం. నేడో రేపో సీపీఎం కూడా మనతో కలిసి వస్తుంది. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్లను కూడా కూడదీసి ముందుకు పోతాం. కరెంటు మీటర్లకు, రైతు వ్యతిరేక విధానాలకు, మన వడ్లు కొననందుకు, మన కరెంట్ బంద్ చేస్తున్నందుకు, మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నషాలానికి అంటాలన్నారు సీఎం కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version