రియల్ లైఫ్ లో కమల్ నాయకుడిగా రాణిస్తాడా…?

-

ఆరుపదుల వయస్సు దాటిన అరవనటుడిగా,లోకనాయకుడిగా అలరిస్తున్న కమల్ హాసన్ బర్త్ డే నేడు.నటుడిగానే కాకుండా అన్ని విభాగాలలో గ్రిప్ ఉన్న సకలకళావల్లభుడిగా కమల్ గుర్తింపు పొందాడు.రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోను హీరోగా అనిపించుకోవాలని చూస్తున్నాడు.దానిలో భాగంగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇంతకాలం నటుడిగా లోకనాయకుడిగా అలరించిన కమల్ కు ఈ బర్డ్ డే వెరీ స్పెషల్ .అటు అభిమానులు తమ హీరో కామన్ డిపి ని రిలీజ్ చేసారు.

బర్త్ డే బాయ్ కమల్ ఓ వైపు రాజకీయాల్లో బిజిగా ఉంటూనే మరో వైపు వరుస సినిమాలకు స్కెచ్ వేసుకున్నాడు మొన్నటివరకు సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయిన కమల్ ..వచ్చే ఏడాది ఎన్నికలు సమీపించే టైమ్ కు రెండు మూడు సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాడు.ఇండియన్ -2కు లైకా ప్రొడక్షన్ నుంచి కాల్ వస్తే దాని షూటింగ్ తో పాటే..ఇటు లోకేష్ కనగరాజ్ ఫిలిం పూర్తి చేయాలని చూస్తున్నాడు.

కమల్ హాసన్ రాజ్ కమల్ బ్యానర్లో నిర్మిస్తున్న 50వ ఫిలిం లోకేష్ కనగరాజ్ ది కావడంతో ఈ డార్క్ థ్రిల్లర్ ను ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.ఇందుల్లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.వచ్చే వేసవిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.బర్త్ డే కానుకగా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులను సర్ఫరేజ్ చేస్తున్నారు.అయితే నటుడిగా ఇన్ని పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్న రాఘవన్ ..రేపు నాయకుడుగా ఎంతవరకు రాణిస్తాడనేది ఫ్యాన్స్ కు తెలియకుండా ఉంది.

అలాగే సినిమాలలో లీడర్ గా ఓకే అనిపించుకున్న కమల్ కు రజనీ నుంచి సపోర్ట్ లభిస్తే గనుక..అటు రీల్ లైఫ్లోను నాయకుడు అనిపించుకోవడానికి స్కోప్ ఉంటుందేమో.లేదంటే చిరంజీవి,విజయ్ కాంత్ ల మాదిరిగా కొన్ని రోజులు ఫైట్ చేసి సైలంట్ అయిపోవల్సి ఉంటుంది. మరి ఈ బర్త్ డే కైనా కమల్ పొలిటికల్ స్టెప్ కు రజనీ సపోర్ట్ దొరుకుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version