కమల్ హాసన్ కు “విక్రమ్” – రజినీకాంత్ కు “జైలర్”

-

గతంలో తమిళ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుందో తెలిసిందే. ఈ సినిమా సీనియర్ నటుడు , లోకనాయకుడు కమల్ హాసన్ కు సరైన సమయంలో బ్రేక్ ఇచ్చింది. మొత్తం ఇండియా సినిమా అంతా దద్దరిల్లిపోయేలా కలెక్షన్ లతో అదరగొట్టింది. ఈ సినిమా వలన డైరెక్టర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఒక్క సినిమా కమల్ హాసన్ కెరీర్ ను మరో పది సంవతసరాలు బ్రతికించింది.. అని చెప్పాలి. కాగా ఇండియా సినిమాలో మరో ఆణిముత్యం సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు అదే స్థాయి హిట్ ను అందుకున్నాడు. ఈ గురువారం థియేటర్ లలో చాలా గ్రాండ్ గా విడుదలైన జైలర్ మూవీ వెర్రెక్కిపోయే విధంగా ప్రేక్షకులకు ఉర్రూతలూగిస్తోంది. రజినీకాంత్ కెరీర్ లో రోబో సర్వథా అంత పెద్ద హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని సినిమా యూనిట్ అంతా ఆనందంలో ఉంది.

కాగా ఈ సినిమాకు కాంపిటీషన్ కూడా ఎవరూ లేకపోవడం ప్లస్ అయింది. మొదటి రోజు రికార్డ్ కలెక్షన్ లతో అదరగొట్టిన తలైవా.. ఈ రోజు రేపు మరిన్ని కోట్లను కోళ్ల గొట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version