జనసేన – బిజెపి పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలి: పురందేశ్వరి

-

జనసేన – బిజెపి పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలని కోరారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. శనివారం రాష్ట్ర కార్యవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు పురందేశ్వరి. ఈ సందర్భంగా సర్పంచుల సమస్యలపై పోరాటం బాగా చేశారంటూ నేతలకు ఆమె అభినందనలు తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మూడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈనెల 14న విభాజిత్, విభీషణ్ కార్యక్రమాన్ని చేపట్టాలని.. అదే రోజు రాత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నేతలంతా కలిసి పని చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version