తెలంగాణ‌లో జ‌న‌సేన‌తో పొత్తు వ‌ద్దంటున్న క‌మ‌ల‌నాథులు.. అస‌లు కార‌ణం ఇదే

-

వ్యూహాలు ప‌న్న‌డంలో ఇప్పుడు బీజేపీ నేత‌ల త‌ర్వాతే ఇంకెవ‌రైనా అని చె్పాలి. ఎందుకంటే ప‌ట్టు లేని రాష్ట్రాల్లో బ‌లాన్ని పెంచుకోవ‌డం వీరి త‌ర్వాతే ఇంకెవ‌రికైనా సాధ్యం. ఇప్ప‌టికే ఈ విష‌యంలో వారు ఎన్నోసార్లు చేసి చూపించారు. అస‌లు ఉనికి లేని తెలంగాణ‌లో ఇప్పుడు ఏకంగా ప్ర‌తిఫ‌క్ష పార్టీగా ఎదిగారంటేనే వారి వ్యూహాలు ఏ స్థాయిలోఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ప‌ట్టులేన‌టువంటి ఏపీలో కూడా వారు బ‌లం పెంచుకునేందుకు జ‌న‌సేన‌తో పొత్తుపెట్టుకున్న సంగ‌తి అంద‌రికీ విదిత‌మే.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అయితే ఈ పొత్తును ఇటు తెలంగాణ‌లో కొన‌సాగించ‌డంలో మాత్రం బీజేపీ వ్య‌వ‌హారం అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక వాతావ‌ర‌ణంలో మ‌రోసారి జ‌న‌సేన‌తో పొత్తు విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. బీజేపీకి మిత్ర పక్షం అయిన‌ జనసేనతో క‌లిసి ప్ర‌చారం చేస్తారా అనే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇక ఈ నేప‌థ్యంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి.

అవేంటంటే జనసేనతో క‌లిసి పనిచేసే విషయమై పెద్ద‌గా ఆలోచించ‌ట్లేద‌ని, అవ‌స‌ర‌మైతే పార్టీ కోర్ క‌మిటీతో చ‌ర్చిస్తామ‌ని అంటున్నారు. అంటే బీజేపీ తెలంగాణ‌లో జనసేనతో క‌లిసి ప‌నిచేఏందుకు పెద్దగా ఆస‌క్తి క‌న‌ప‌రుస్త‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్క‌డ బీజేపీ బ‌ల‌ప‌డుతోంది. ఇలాంటి టైమ్‌లో జ‌న‌సేన‌తో పొత్తు మంచిది కాద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తు్నారు. క్రెడిట్ త‌మ‌కు ద‌క్క‌దేమో అనే భావ‌న‌లో ఉన్నారు. ఇంకోవైపు ఆంద్రా, తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ తెర‌మీద‌కు తెస్తున్న క్ర‌మంలో ఇద వ‌ద్ద‌ని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version