టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హఠాన్మరణం

-

తెలంగాణాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి కన్నుమూశారు. ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న ఆయనకు 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడంతో బిజెపిలో చేరి టిడిపి – బిజెపి కూటమి తరపున పోటీ చేశారు. అయితే అప్పుడు ఆయన ఓటమిపాలయ్యారు. రామ్ రెడ్డికి కేవలం 13355 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక 2018 ఎన్నికల సమయానికి ఆయన్ని బీజేపీ సస్పెండ్ చేసింది.దీంతో పరిగి బహిరంగ సభలో ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుండి తన రాజకీయ జీవితం ప్రారంభించిన కమతం రామిరెడ్డి 1967లో ఇండిపెండెంటుగాను, 72,89లలో కాంగ్రెస్ తరపున గెలిచారు. ఈయన కొంతకాలం జలగం క్యాబినెట్ లోనూ, నేదురుమల్లి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా మంత్రిగా పని చేశారు/

Read more RELATED
Recommended to you

Exit mobile version