ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశానికి ఆహ్వానం !

-

– తిరుపతిలోని టిటిడి ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిసెంబరు 8 నుండి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

కళాశాలలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్, నాదస్వరం, డోలు, మృదంగం, ఘటం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ విభాగాలున్నాయి. బి.మ్యూజిక్, బి డ్యాన్స్, విశారద, ప్రవీణ కోర్సులున్నాయి. ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్, డిప్లొమా రెగ్యులర్ కోర్సులతోపాటు సాయంత్రం కళాశాల పార్ట్టైమ్ కోర్సులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని కోర్సుల వారికి డిసెంబరు 28 నుండి 31వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించవచ్చు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version