ప్రస్తుతం ఐపీఎల్ యాక్షన్ ఫీవర్ నడుస్తోంది. చాలా మంది క్రికెటర్ల తమ జట్లను వీడి.. వేరే జట్లల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే… న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కు సన్రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్ కు ముందు విలియమ్సన్ ను రిటైన్ చేసుకోకుండా వేలంలో పెట్టింది.
అతనితో పాటు ఈ ఏడాది మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలాస్ పూరన్ ను కూడా సన్రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టింది. ఐపీఎల్ 2023 సీజన్ కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది. తమ రిటెన్షన్ లిస్ట్ ను సమర్పించే గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో ఎస్ ఆర్ హెచ్ తమ జాబితాను ప్రకటించింది. ఐపీఎల్-2023 సీజన్ కు ముందు ఎస్ ఆర్ హెచ్ కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది.