ఏపీ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కన్నా లక్ష్మీనారాయణ.
రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందున రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా బిజెపి పార్టీని వీడారు. కాగా గత కొంత కాలంగా బిజెపి పార్టీలో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది.