కన్నప్ప సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. కన్నప్ప సినిమా నుంచి టీజర్ వచ్చేసింది. టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.
అదేవిధంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. అయితే.. తాజాగా కన్నప్ప సినిమా నుంచి టీజర్ వచ్చేసింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.