సీఎం, పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదని.. తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం

-

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసు చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకివెళితే.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఓ మహిళను తన భర్త శివ నాగరాజు, విక్రాంత్ పబ్లిషర్ చైర్మన్ చక్రవర్తి, అత్తమామలు దుర్గ, వెంకటేశ్వరరావు, మరిది శివకృష్ణలు నిత్యం తనను, తన కూతురిని వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ, సీఎం ఆఫీస్ చుట్టూ ఎంత తిరిగినా న్యాయం దక్కలేదని వాపోయింది. అందుకే తాము ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు సదరు మహిళ కన్నీరుమున్నీరైంది.

https://twitter.com/TeluguScribe/status/1895703711520858201

Read more RELATED
Recommended to you

Exit mobile version