Kantara : అమెజాన్ ప్రైమ్ లో కాంతార..స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

-

కన్నడ చిత్రాలు కేజీయఫ్​, చార్లీ 777, విక్రాంత్ రోణ సూపర్​హిట్ కావడం వల్ల అక్కడి చిత్రాలకు బాగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన చిత్రం ‘కాంతారా’. సగటు ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను సైతం మంత్ర ముగ్దుల్ని చేస్తోంది.


దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంటోంది. తొలుత కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ఆ తర్వాత అన్ని భాషల్లోనూ సూపర్​హిట్​గా నిలిచింది. విడుదలైన ప్రతి చోట కూడా భారీ కలెక్షన్లను అందుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. కాంతారా సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ తో సహా డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా… నవంబర్ 24వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version