ఎన్టీ రామారావు మాట విననందుకే కాంతారావు పరిస్థితి ఇలా అయ్యిందా..

-

Entertainment వెండి తెర అంటేనే రంగుల ప్రపంచం ఈ ప్రపంచంలో ఏ రోజు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికి తెలియదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే తీరును ఇప్పటి మన నటీనటులు పద్ధతిగా ఫాలో అయిపోతున్నారు అయితే ఈ విషయంలో మన ముందుతరం కథానాయకుడు మాత్రం కొంచెం వెనకబడినట్టే తెలుస్తోంది ముఖ్యంగా కొందరి పరిస్థితి చూస్తే నిజమే అని అనక తప్పడం లేదు తాజాగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన మన మొదటి తరం నాయకుడు కాంతారావు శతజయంతి రోజు జరిగిన సంఘటన అందర్నీ కలిసి వేసింది దీనికి సంబంధించిన ఫోటో ఒకటి బయటికి రాగా ఈ విషయంపై ఎన్నో కథలు వినిపిస్తున్నాయి..

ఒకప్పటి మన కథానాయకుడు ఎన్టీ రామారావు కు సమానంగా పాత్రలు పోషించిన మరొక నటుడు కాంతారావు ఆ రోజుల్లో ఎన్టీఆర్కు దీటుగా రెమ్యూనరేషన్ అందుకున్న నటుల్లో కాంతారావు కూడా ఒకరు.. తన సినీ కెరీర్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించినా ఈయన చివరి దశ వరకు నటిస్తూనే ఉన్నారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కు సమకాలీయనుడు ఎవరు అంటే కాంతారావు అనే చెప్పవచ్చు తెలుగు చిత్ర సేవకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు అయితే వాటి మధ్య తిలకం వంటి వారు కాంతారావు అంటూ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కాంతారావును కొనియాడారు.. ఎన్నో జానపద పౌరాణిక చిత్రాల్లో నటించిన కాంతారావు అప్పట్లో బాగానే సంపాదించారు అయితే ఎంత సంపాదించినా జాగ్రత్త లేకపోతే చివరికి ఇబ్బంది పడాల్సి రాక తప్పదని ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.. అయితే ఒకప్పటి రోజుల్లో ఎన్టీఆర్ కాంతారావుకు ఎన్నో విషయాలు బోధించేవారు అంట అందులో ముఖ్యంగా ఆర్థిక సంబంధాలను గురించి తరచూ చెప్తూ ఉండేవారట సంపాదించేదంతా మనం వెనుకకు దాచుకోకుండా ఖర్చు పెట్టడం వల్ల తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నోసార్లు చెప్పిన ఆయన మాటను గడచిన పెట్టారంట కాంతారావు దాంతో చివరి రోజుల్లోకి వచ్చేటప్పటికి ఏమీ మిగలకుండా అయిపోయింది నేటికీ ఆయన శతజయంతి వేడుకల పరిస్థితి చూస్తే ఈ విషయం పూర్తిగా కళ్ళకు కట్టినట్టు అర్థం అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version