మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపుతూ తెలుగులో ట్వీట్ చేసిన మోదీ..

-

మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 53 వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2022 దక్కించుకున్నారు.. ఈ నేపథ్యంలో చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు..

`ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్ 2022`కి మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి విషెస్ తెలిపారు..`చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్నమైన నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణనూ చూరగొన్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా చిరంజీవికి అభినందనలు` అని పేర్కొన్నారు మోడీ. అయితే తెలుగులో నరేంద్ర మోడీ క్రియేట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ ట్వీట్ పై స్పందించారు చిరంజీవి… ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా మోడీ పైన అపారమైన గౌరవం వినయంతో కూడిన అనుభూతి కలిగిందని చెప్పారు..

భారతీయ సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక పురస్కారాన్ని 2013 నుంచి అందిస్తున్నారు ఇప్పటివరకు అవార్డును వహీదా రెహ్మాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం, అమితాబ్‌ బచ్చన్‌, సలీమ్‌ ఖాన్‌, బిశ్వజిత్‌ చటర్జీ, హేమా మాలిని, ప్రసూన్‌ జోషిలకు అందజేశారు. 2022కిగానూ చిరంజీవిని ఎంపిక చేశారు. ఈ అవార్డు ఇచ్చేటప్పుడు నెమలి బొమ్మతో ఉన్న రజత పతకం, పది లక్షల రూపాయలు, ధృవీకరణ పత్రాన్ని అందజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version