కర్ణాటక డిప్యూటీ స్పీకర్ కన్నుమూశారు. కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, బిజెపి ఎమ్మెల్యే ఆనంద్ మామని (56) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన మధుమేహం, కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు.
బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తోలుత చికిత్స నిమిత్తం వైద్య నిపుణుల సలహా మేరకు చెన్నైకి తరలించి, అనంతరం మణిపాల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొన్ని రోజులుగా కోమాలో ఉన్న ఆయన తుది శ్వాస విడిచారు.