కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తను అత్యంత దారుణంగా నిన్న రాత్రి హత్య చేశారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో శివమొగ్గలో 26 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు గురయ్యాడు. దీంతో నగర వ్యాప్తంగా ప్రభుత్వం భద్రతను పెంచింది. కర్ణాటకలో ప్రస్తుతం ఈ హత్య చర్చనీయాంశంగా మారింది.
4-5 మంది యువకుల బృందం అతన్ని హత్య చేసిందని.. ఈ హత్య వెనుక ఏ సంస్థ హస్తం ఉందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదని.. శివమొగ్గలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని.. ముందుజాగ్రత్త చర్యగా నగర పరిధిలోని పాఠశాల లు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించామని కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. మాండ్యా ఎంపీ, సినీ నటి సుమలత కూడా ఈ హత్య గురించి స్పందించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని.. కొన్ని సంఘాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.
ఇప్పటికే హిజాబ్ వ్యవహారం కర్ణాటక వ్యాప్తంగా రచ్చ రేపుతోంది. ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుని.. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీసింది. తాజాగా ఈ హత్య కావడంతో ఇది వర్గాల మధ్య ఘర్షణను పెంచాలని చేసిందిగా.. అధికారులు భావిస్తున్నారు.