త్వరలోనే వినాయక చవితి పండుగ జరుగనున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడి నిర్మాణానికి నేడు అంకురార్పణ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు మహాగణపతి కర్ర పూజ నిర్వహించనున్నారు.
దీంతో గణనాథుడి నిర్మాణం ప్రారంభం కానుంది. కాగా గతేడాది మట్టితో తయారుచేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ప్రతిష్టించారు. కాగా ఇటీవలి కాలంలోనే… ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దవాఖన లో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు.