కార్తీకదీపం ఎపిసోడ్ 1164: సీరియల్ లో ఊహించని ట్విస్ట్..దీపకు యాక్సిడెంట్..వంటలక్క పాత్ర ముగిసిందా?

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో హిమ ఒక్కతే ఏదో ప్లేస్ లో బెంచ్ పై కుర్చుని ఆసుపత్రిలో మోనిత అన్నమాటలను తలుచుకుని బాధపడుతుంది. మోనిత ఆన్టీ చెప్తుంటే, డాడీ ఏం మాట్లాడలేదంటే డాడీ బాడ్ బాయ్ కదా అనుకుంటూ ఏడుస్తుంది. ఎవరు చెప్పేది నిజమో, ఎవరు చెప్పేది అబద్ధమో అర్థంకావటంలేదు అనుకుంటూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు పేపర్ చూసేశారని దీప సౌందర్యకు చెప్తుంది. ఇప్పుడేం చేద్దామే అని సౌందర్య అంటుంది. పిల్లలు అడిగే ప్రశ్నలకు ఒక్కటంటే ఒక్కదానికి కూడా సమాధానం లేదు అత్తయ్య అని దీప అంటుంది. ఇద్దరు ప్రస్తుత పరిస్థితి తలుచుకుని భయపడుతూ ఉంటారు. శౌర్య కొంతలో కొంత మేలు అత్తయ్య, హిమను నమ్మించటం, ఒప్పించటం మనవల్ల అయ్యేపనిలా లేదు. శౌర్యతో మాట్లాడదాం రా దీప అని ఇద్దరూ శౌర్య దగ్గరకు వెళ్తారు.

జైల్లో మోనిత కార్తీక్ ను చూసినందకు చాలా ఆనందంగా ఉంది అనుకుంటూ నవ్వుతుంది. ఇంతలో సుకన్య వచ్చి ఏంటి మేడమ్ ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే కార్తీక్ ను కలిశాను కదా, హట్ఎటాక్ ప్లాన్ హాట్ ఫుల్ గా ముగిసింది అంటుంది. అయితే పార్టీ ఇస్తారా మేడమ్ అంటే..సోడా పార్టీ అని ఇద్దరూ సోడా తాగుతారు. కార్తీక్ ని కలిసింది హిమ చూసింది, మిసైల్ పేలినట్లే ఇంట్లో రచ్చరంబోలా అనుకుని నవ్వుతుంది.

ఇంట్లో సౌందర్య శౌర్యతో మీ నాన్న మంచోడని చెప్తూ ఉంటుంది. శౌర్య మీ అబ్బాయి గురించి మంచి అని చెప్పక ఇంకేం చెప్తావ్ లే నానమ్మ అంటుంది. ఆ మోనిత వేసిన వెదవ ప్లాన్ లో మీ నాన్న చిక్కుకున్నాడు, మీ నాన్న మంచోడే ఈ ముక్క హిమకు అర్థమయ్యేలా చెప్పు అంటుంది. సరే నానమ్మ నేను నమ్ముతున్నాను అంటుంది శౌర్య. ఇంతలో హిమను ఆదిత్య, శ్రావ్యలు తీసుకొస్తారు. ఏమైందే స్కూల్ లేదా అని సౌందర్య అంటే..తలనొప్పి అని వచ్చేశాను అంటుంది. పిల్లలు ఇద్దరు కలిసి పైకి వెళ్తుంటే దీప కనిపించి హిమ స్కూల్ కి వెళ్లలేదా అంటే హిమ కోపంగా వెళ్లిపోతుంది. దీప వచ్చి సౌందర్యను అడుగుతుంది. దార్లో కనిపిస్తే ఆదిత్య తీసుకొచ్చాడు, అడిగితే తలనొప్పి అని చెప్తుంది అంటుంది.

ఆదిత్య కోపంగా ఇంట్లో నోరివిప్పకపోవటం అందరికి అలవాటే కదా, దారిలో వచ్చేప్పుడు డల్ గా ఉన్నావేంటని హిమను అడిగా చెప్పదు, ఏటూకాకుండా అక్కడున్నావేంటని శ్రావ్య అడిగితే..నన్ను వదిలే పిన్ని అనింది. అలా అనొచ్చా అంటే..ఏదో చిరాకులో ఉన్నారని సౌందర్య అంటుంది. దీప ..పిల్లలు ఇద్దరు మోనితగురించి పేపర్లో రాసింది చదివారు ఆదిత్య అందుకే అలా ఉన్నారు అంటుంది. ఇదే కదా జరిగింది, పిల్లలు ఇద్దరిని కుర్చోపెట్టి ఇలా రాయించింది అని ఓపెన్ గా చెప్తే మనం చెప్పేది నమ్ముతారు, అలా కాదంటే పదిమంది చెప్పేది నమ్ముతారు. సౌందర్య.. ఆదిత్య ఏంటి నువ్వు అంటుంది. నన్ను మాట్లాడనిన్వు మమ్మి అంటాడు.

పిల్లలకు నిజం చెప్పేస్తే ఆ మోనిత ఎదురు వచ్చి చెప్పినా నమ్మరు కదా.. ఇంత చిన్న విషయాన్ని పెద్ద సమస్యలా చేస్తున్నారు అంటాడు. నువ్వునుకున్నంత చిన్న విషయం కాదిది, నిజం చెప్తే సరిపోదురా ఈ పిల్లలు వంద ప్రశ్నలు వేస్తారు అని సౌందర్య అంటుంది. దీప కూడా అవును ఆదిత్య, పిల్లలకు కొన్నే చెప్పగలం అంటుంది. ఆ కొన్ని కూడా చెప్పటంలేదు కదా, నిజం దాచిపెడితే టెన్షన్ అంటూ ఆదిత్య ఫైర్ అవుతాడు. సౌందర్య కూడా కోపంగా ఆదిత్యా…పిల్లలకు అన్ని చెప్పలేం అంటున్నాం కదా అంటుంది. ఒకవేళ నిజం చెప్పలకేపోతే.. అమెరికా వెళ్లటమే ఉత్తమం కదా అని వెళ్లిపోతాడు. ఇంతలో ఆనంద్ రావు వస్తాడు. ఏమైంది అంటాడు. ఏం కావటం లేదు డాడీ, అదే నా బాధ కూడా అంటాడు. ఏం జరిగింది అంటే ఏదేదో చెప్తావేంటి అంటాడు ఆనంద్ రావు. ఏం జరిగిందో వెళ్లి అక్కడ అడగండి అని ఆదిత్య బయటకు వెళ్లిపోతాడు.

హాస్పటల్ లో కార్తీక్..మోనిత అన్న మాటలను తలుచుకుని ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. మోనిత వచ్చిన విషయం దీపకు చెప్తే..చెప్పి తనని టెన్షన్ పెట్టటం తప్ప సాధించేది ఏది ఉండదు చెప్పను అనుకుంటాడు. భారతికి ఫోన్ చేసి క్యాబిన్ కి పిలిపిస్తాడు. ఇంకోపక్క వేరే సీన్లో హిమ శౌర్యతో ఆసుపత్రిలో చూసింది చెప్తుంది. పాపం హిమ ఏడుస్తూ..మన ఇద్దరిని అబద్ధాలతోనే పెంచారు శౌర్య, డాడీ మోనిత ఆన్టీని ఎందుకు కలవాలి అంటుంది. శౌర్య డాడీ, మోనిత ఆన్టీ ఫ్రెండ్స్ కదా అంటుంది. ఫ్రెండ్స్ కాదు ఇంకేదో ఉంది..మనం విజయనగరంలో ఎక్కడున్నామో చెప్తే నాన్న మోనిత ఆన్టీని పెళ్లిచేసుకుంటా అన్నాడంట అని చెప్తుంది. శౌర్య అలా ఎలా అంటాడు అంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో కార్తీక్ బర్తడే అంట..కార్తీక్ ప్రేమగా పిల్లల దగ్గరకు వచ్చి ఏంట్రా ఈరోజు డాడీ హ్యపీ బర్డే కదా మర్చిపోయారా అంటూ కుర్చోబోతాడు. హిమ లేచి వెళ్లిపోతుంది. ఇంకోసీన్ లో దీప రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుంది. ఒక కారు వచ్చి దీపను ఢీ కొడుతుంది. దీపకు యాక్సిడెంట్ ప్లాన్ చేశారు..మరి దీన్ని బట్టి దీప పాత్ర ముగుస్తుందా, డైరెక్టర్ ఏం ప్లాన్ చేశాడో రేపు చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version