కార్తీకదీపం సెప్టెంబర్ 10 ఎపిసోడ్ 1141 : బోనులో నిలబడ్డ కార్తీక్..నా కొడుకు నేరం చేయలేదని సౌందర్య ఆవేదన

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో రోడ్డుపక్కన కారుదగ్గర వెయిట్ చేస్తున్న దీప దగ్గరకు మోనిత గన్ తో వస్తూ ఉంటుంది. దీప కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోనిత.. దీప దారిలోనే ఆగిపోయిందేంటి అనుకుంటది. వారణాసి పెట్రోల్ నింపటం చూసి అదా సంగతి అనుకుంటుంది. ఇంకోపక్క కోర్టులో కార్తీక్ ను ప్రవేశపెడతారు. మోనిత తరుపు లాయర్ లేచి తప్పంతా కార్తీక్ దే అన్నట్లు చెప్పుకొస్తాడు. మోనితను ప్రేమించాడని, గర్భంచేసాడని ఇలా వేరే యాంగిల్ లో స్టోరిని చెప్తాడు. కక్ష పెంచుకుని రివాల్వర్ తో షూట్ చేసి చంపాడని చెప్తాడు లాయర్. ఈ మద్దాయిని కఠినంగా శిక్షించాలని చెప్పి తన వాదనను వినిపిస్తాడు. జడ్జ్ కార్తీక్ ను మీరు ఈ నేరాన్ని అంగీకరిస్తున్నారా అని అడుగుతాడు. కార్తీక్ లేదంటాడు. ఇంతలో కార్తీక్ తరుపు లాయర్ పర్మిషన్ తీసుకుని రోషిణిని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుని బోన్ లోకి పిలిపిస్తాడు.

కార్తీక్ ను ఎక్కడ అరెస్ట్ చేశారు అంటే..కార్తీక్ ఇంట్లో అని రోషిణి అంటుంది. ఎప్పుడు అంటే.. 25వ తేదీన అరెస్ట్ చేశాం అంటుంది రోషిణి. 24వ తేదీన హత్య జరిగితే 25వ తేదీ న చేశారు. ఎందుకు లేట్ అయింది అని లాయర్ అడుగుతాడు. అప్పుడు మాకు ఎవరు కంప్లెంట్ ఇవ్వలేదు. నెక్ట్స్ డే మోనిత ఇంటి పనిమనిషి కంప్లెంట్ చేసింది. అంటే ఆ పనిమనిషి ప్రత్యక్షసాక్షి కాదు అనమాట అంటాడు. ఇలా విచారణ జరిపి..ఫైనల్ గా ప్రత్యక్ష సాక్షులను తీసుకురాకుండా..ఉన్నవారిని ఆ జాబితాలో చేర్చారు అని లాయర్ అంటాడు.

రివాల్వర్ సౌందర్యది అవటంతో..తనని బోన్ లోకి ప్రవేశపెడతారు. మిస్ అయిన బులెట్ లెక్క అడుగుతాడు లాయర్. ఏసీపీ కథనం ప్రకారం.. ఒకటి మోనిత బాడీలో ఇంకోటి సంఘటన జరిగిన స్థలంలో ఉండి ఉండాలి అంటుంది. అంటే మీ అబ్బాయే ఈ హత్య చేశాడా అని లాయర్ అడుగుతాడు.ఈ జన్మలో నమ్మను అని కార్తీక్ వ్యక్తిత్వం గురించి చెప్తుంది. మోనిత మీకు తెలుసా అని లాయర్ అడుగుతాడు. తెలుసు మా అబ్బాయు క్లాస్ మెట్స్ అంతేకాదు మోనిత నా కొడుకుని ప్రేమించిందనే మాట వాస్తవం అంటుంది సౌందర్య. బుల్లెట్స్ కూడా మోనితే మాయం చేసిందంటుంది.

మోనిత తరుపు న్యాయవాది లేదు ఇది హత్యే అని ఖండిస్తాడు. ఇంతలో మోనిత దీపకు పాయింట్ బ్లాక్ లో గన్ పెడుతుంది. అరిచినా కదిలినా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్ అంటూ కార్ ఎక్కమంటుంది. బలవంతంగా కార్ ఎక్కిస్తుంది. అతి తెలివితేటలు చూపించి పోలీస్ స్టేషన్ కు వెళ్లటం లాంటివి చేస్తే మీ అక్క తల చిట్లిపోతుంది అని చెప్పి ఊరవతల బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లమని వారణాసికి చెప్తుంది. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావ్..అని దీప అడుగుతుంది. నిన్ను చంపేయాలనుకుంటున్నా నువ్వు చస్తే నాకేఅడ్డు ఉండదు. కార్తీక్ కోర్టుకు వెళ్లిపోయాడు. నా పెళ్లి వాయిదా పడింది అంతే.. నువ్వు చచ్చిపో మీ ఆయన్ని నాకు ఇచ్చిపో అంటూ వెకిలిగా నవ్వుతుంది.

ఇంకోపక్క బోనులో నిలబడ్డ సౌందర్య కార్తీక్ హత్యచేశాడంటే నేను నమ్మలేను అని అంటుంది. కార్తీక్ గుణగణాల గురించి చెప్తుంది. హత్యచేశాడు అనడానికి అవకాశాలే తప్ప.. చేయలేదు అనడానికి ఆధారాలెక్కడ నాకు కనిపించలేదు, వినపించలేదు అంటూ ఏడుస్తుంది. ఇలానే ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version