కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత తన ఇంటికి వస్తుంది. తన ఇళ్లంతా పాడుపడిన భంగళా టైప్ ఉంటది. ఈ మోనిత ఇంటి బయటే నుల్చుని..నేను, నా కార్తీక్, మన ఆనంద్ ఇక్కడే ఉండబోతున్నాం అనమాట అనుకుని..వెళ్లి డోర్ తీస్తుంది. మొత్తం దుమ్ము, ధూళి..కార్తీక్ మనసు ఒప్పిస్తాను, నిన్ను ఒప్పించటానికి ఎంతకైనా, ఎన్నాళ్లైనా ఓపికపడతాను అనుకుంటుంది. ఆరోజు రాత్రి కార్తీక్..మోనిత అన్నమాటలను సౌందర్యకు చెప్తాడు. సౌందర్య ఇక్కడే ఉంటే అదిఏదో ఒకటి చేస్తుంది..పిల్లకు సమాధానం చెప్పలేం కదరా అంటుంది. పర్లేదు మమ్మీ పిల్లలకు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను, తనెవరు మమ్మీ మనల్ని బెదిరించటానికి..సమయం సందర్భం చూసి పిల్లల్ని కుర్చోపెట్టి చెప్పగలిగినంత చెప్పేస్తాను అంటాడు. కోరి కష్టాలను తెచ్చుకుంటున్నావేమోరా అంటుంది సౌందర్య. అయినా మనోడు వినడు..అదిఇది చేస్తా అంటూ పెద్ద అన్ని చేసేవాడిలాగే మాట్లాడతాడు..ఆ మోనితను అని గట్టిగా అరవబోతాడు..ఇంతలో దీప రావటం చూసి టాపిక్ మారుస్తారు అమ్మాకొడుకులు. మన వంటలక్కకు అయినా అర్థమవుతంది. ఇప్పటిదాకా ఏదో మోనిత గురించి మాట్లాడుతూ..నేను రాగానే టాపిక్ మార్చారు అనుకుంటుంది. కార్తీక్ ఏంటి దీప అక్కడే నిలబడ్డావ్ అంటే..మీరు మాట్లాడుకుంటున్నారుగా అంటుంది దీప. అదే హిమ గురించి అంటారు..నేను అడగలేదుగా అంటుంది దీప..అలా ఆ సీన్ అయిపోతుంది.
కార్తీక్ మోనిత అన్న మాటలను తలుచుకుని..మోనిత కలిసిన విషయం దీపకు చెప్పలేను..అలా అని ఈ భారాన్ని మోయలేను అనుకుంటాడు. ఇంకోవైపు పిల్లల గురించి ఆలోచిస్తాడు. అమెరికా వెళ్లటంలేదు అనగానే దీప పిల్లలతో బ్యాగ్ లు తీసుకుని వెళ్లిపోయిన సీన్ తలుచుకుని..ఎందుకు అమెరికా వద్దన్నాను అని దీప అడగలేదు..దీప మౌనం నన్ను ఇంకా చిత్రవిధచేస్తుంది అనుకుంటాడు. సౌందర్య వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ రా అంటుంది. ఏం ఆలోచిస్తే ఏం ప్రయోజనం మమ్మీ అంటాడు. ఇటుపక్క మోనిత ఆసుపత్రిలో ఉంటుంది. భారతీ కార్తీక్ కి కాల్ చేస్తుంది. మొదట కట్ చేస్తాడు. మళ్లీ చేస్తుంది. ఏంటి భారతి ఏంటి అంటాడు కార్తీక్ సీరియస్ గా. భారతి..మోనితకు నొప్పులొచ్చాయ్, తన కండీషన్ చాలా సిరయస్ గా ఉంది అంటుంది. చస్తే ఛావని నాకెందుకు చెప్తున్నావ్ అంటాడు కార్తీక్. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయిభాగంలో కార్తీక్ ఇప్పుడు ఈ సంతకం పెడితే దీపను దారుణంగా మోసిచేసినవాడ్ని అవుతాను అంటాడు. తనమీద కోపంతో పసిబిడ్డకు అన్యాయం చేయలేం కదా అంటుంది సౌందర్య. అసలువీళ్లకు బుర్రఉందోలేదో..ఉన్నా వాడతారో లేదో ప్రేక్షకులకు అర్థంకాదు..భర్తస్థానంలో ఉండి కార్తీక్ సైన్ చేస్తే రేపు ఆ మోనిత అదే ప్రూఫ్ గా చూపించి రచ్చచేస్తుందికదా. ఈ చిన్నలాజిక్ ఎందుకు మిస్ అవుతారు. మానవత్వానికి మరోపేరు అన్నట్లు సౌందర్య ప్రవర్తిస్తుంది. ఎలాగైతే కార్తీక్ ని సంతకం పెట్టడానికి ఒప్పించి తీసుకెళ్లబోతుంది. పాపం మన వంటలక్క వంటచేసుకుంటూ..అత్తయ్యఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. గుడికి అంటుంది సౌందర్య. నేను వస్తా అంటుంది దీప. నేను కార్తీక్ తో మొక్కుకున్నాను ఇద్దరమే వెళ్లాలి అంటుంది సౌందర్య. దీప ఏం మొక్కు డాక్టర్ బాబు అంటుంది. మొక్కుకున్నది నేనైతే వాడికెలా తెలుస్తుందే అంటుంది సౌందర్య. దీపకు మ్యాటర్ అర్థమవుతుంది..వీళ్లు కావాలనే నన్ను సైడ్ చేస్తున్నాను..అత్తయ్య అబద్ధం చెబుతున్నారని అర్థమవుతుంది అనుకుంటుంది. ఈ కుటుంబకథాచిత్రంలో రేపు ఏం జరగబోతుందో వేచిచూద్దాం.
– Triveni Buskarowthu