కార్తీకదీపం ఎపిసోడ్ 1158: జైలుకి వెళ్లి మోనితకు వార్నింగ్ ఇచ్చిన దీప..వంటలక్కతోనే డీల్ మాట్లాడిన మోనిత

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో శౌర్య డబ్బులకోసం బెడ్ పైకి లేపి కవర్ తీసుకుంటుంది. డబ్బులు తీయగానే ఒక కాగితం గాలికి ఎగిరి పక్కనే ఉన్న న్యూస్ పేపర్ మీద పడతాయి.  వాళ్లు అ‌ది మొదట చూసుకోకుండా మిగిలినవి లెక్కేసుకునే పనిలో ఉంటారు. ఇంకోవైపు జైల్లో మోనిత ఇప్పటికే పేపర్ ఇంటికి వెళ్లి చాలా సేపు అయింది…లంకాదహనం చేసినట్లు, కొంపాదహనం అయి ఉంటుంది అనుకుని ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తనే అనుకుని నవ్వుతూ ఉంటుంది. కొంపంతా అల్లకల్లోలం అవుతుందేమో..ఇలాంటి సమయంలోనే నా కార్తీక్ ని కలసుకోలేకపోతున్నాను అని నవ్వి..ఏదో ఒకటి చేసి నా కార్తీక్ ని కలుసుకోబోతున్నాను..కార్తీక్ మీద నా ప్రేమే కార్తీక్ ని కలుసుకునేలా చేస్తుంది అనుకుంటూ తనలో తనే కార్తీక్ పై తనకున్న ప్రేమగురించి మాట్లాడుకుంటుంది. కార్తీక్ నన్ను చూడగానే మొదటిమాట ఏం మాట్లాడతాడు ఛీ కొడతాడా,జాలీ పడతాడా అనుకుంటూ ఉంటుంది.
ఇంకోసీన్ లో పిల్లలు డబ్బులు లెక్కసుకుని 7000 చిల్లర వచ్చాయ్..షాపుకి వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటారు..అలా న్యూస్ పేపర్ మీద పడిన50రూపాయలు తీసుకుంటారు.అప్పుడు పేపర్ లో మోనిత ఫొటో చూసి వార్త చదువుతారు. హిమ మళ్లీ ఏడ్వటం స్టాట్ చేస్తుంది. మోనిత ఆన్టీ డాడీ మంచోడు కాదంటుంది అని హిమ శౌర్యను అడుగుతుంది. రకరకాలుగా ఆలోచిస్తారు. మరోవైపు మనవళ్లు వెళ్లటానికి రెడీ అవుతారు..సౌందర్య ఉండమని బలవంతం చేస్తుంది.  అందరు ఉండమని బతిమిలాడతారు..కానీ వాళ్ల అమ్మ తిడుతుందని ఒప్పుకోరు..అప్పుడప్పుడు వస్తాం అంటారు. ఇల్లుఇక్కడే అంటున్నారు కదా వెళ్లి దిగబెట్టి వద్దాం అని ఆనంద్ రావు అంటాడు. తను నాతో సరిగ్గా మాట్లాడుతుందంటారా..అని సౌందర్య అంటుంది. మాట్లాడితే సరిపోతుంది కదా అని ఆనంద్ రావు అంటాడు. నిరుపమ్( మనవడు) పదా లెట్స్ మూవ్ అంటాడు. సౌందర్య ఆలోచిస్తుంది. ఫైనల్ గా పెద్దొడా ఒకసారి స్వప్న ఇంటికి వెళ్లొస్తాను రా అంటుంది కార్తీక్ తో. వెళ్లు మమ్మి అంటాడు. సౌందర్య, ఆనంద్ రావు వెళ్తారు. ఇదంతా పైన ఉన్న హిమ, శౌర్యలు చూస్తారు.
దీప కంగారుగా ఆ పేపర్ తగలపెట్టాయాలని వస్తుంది. బెడ్ పైకి లేపి ఉండటం చూసి..పేపర్ కోసం వెతుకుతుంది. ఇక్కడే పెట్టాను కదా ఏమైంది, ఎవరు తీసుంటారు అనుకుని కిందపడిన 50రూపాయల నోటు చూస్తుంది. పిల్లలు ఏమైనా తీసుంటారా అనుకుంటుంది. ఇటువైపు హిమ, శౌర్యలు డల్ గా మెట్లపై కుర్చుంటారు. కార్తీక్ ఇటురండ్రా..ఏంటి అలా కుర్చున్నారు అంటాడు. పిల్లలు ఏం మాట్లాడరు..సరే నాన్న దగ్గరకు బంగారాలు రాకపోతే..బంగారాల దగ్గరకే నాన్న వస్తాడని కార్తీక్ వెళ్లి వాళ్ల మధ్యలో కుర్చుంటాడు. లేచి వెళ్లిపోతారు. కార్తీక్ ఏమైందిరా మీకు, క్షణానికో రకంగా మారిపోతున్నారు అని అడుగుతాడు. హిమ శౌర్యతో పదా వెళ్దాం అని తీసుకెల్తుంది.. కార్తీక్..హిమతో ఏమైందమ్మా, మాట్లాడతంటే వెళ్లిపోతున్నారేంటి, నా మీద అలిగారా, బయటకు వెళ్ధాం అన్నారుగా పదండి వెళ్దాం అంటాడు.
ఈ రోజంతా మీ ఇష్టం అన్ లిమిటెడ్ ఫన్ అంటూ బుజ్జగిస్తూ మాట్లడాతాడు. కానీ శౌర్య, హిమలు  ఏం మాట్లడకుండా వెళ్లిపోతారు. అప్పుడే దీప వస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. పాపం కార్తీక్ బాధపడతాడు. పిల్లలకి ఏమైంది, పలకరిస్తే మాట్లడటంలేదు, ఏదోలా కనిపిస్తున్నారు, సరే స్కూల్లో విషయానికి సర్థిచెప్తే నమ్మారు. పూజయ్యాక కూడా నా చెయ్యిపట్టుకుని సారీ డాడీ అని హిమ చెప్పింది. ఇద్దరు నన్న పట్టుకుని ఏడ్చారు. నా బంగారం సారీ డాడీ అంటే పొంగిపోయాను దీప, నా కష్టాలన్నింటికి రెక్కలొచ్చి ఎగిరిపోయినంత సంతోషించాను, కానీ అంతలోనే ఏమైందో తెలియటం లేదు..ఇద్దరికి ఇద్దరు సీరియస్ గా ఉన్నారు అంటూ బాధపడతాడు. దీపకు ఆ పేపర్ ఏమైందో తెలియక కంగారు పడుతుంది. దీపకు మ్యాటర్ అర్థమవుతుంది. దాచిపెట్టిన పేపర్ కనిపించటం లేదని ఇప్పుడు డాక్టర్ బాబుకి చెప్పటం కరెక్ట్ కాదు అని పేపర్ ఏమైనట్టు అని ఆలోచిస్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయి భాగంలో జైలుకి దీప వెళ్తుంది. మోనిత అరే దీపక్కా నువ్వొచ్చావా..ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా అంటుంది. నువ్వేం ఘనకార్యం సాధించావ్ అని పేపర్లో జీవతగాథలు వేస్తున్నావ్, ఇవన్నీ ఆపేయ్ అంటుంది దీప. ఆపేస్తాను..నా మెడలో కార్తీక్ తో తాళికట్టించు డీల్ ఓకేనా..డీల్ నచ్చకపోతే కూడా హ్యీపీయే..నేను చేసేదికూడా చేస్తాను అంటుంది. దీనికి వంటలక్క ఏం సమాధానం ఇస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version