కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడికి కుట్ర.. భగ్నం చేసిన భద్రతా దళాలు

-

జమ్ము కశ్మీర్‌లో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. అవంతిపొరలో ఆత్మాహుతి ఉగ్రదాడిని ముందుగానే గుర్తించి వారి కుట్రను భగ్నం చేశారు. ఈ మొత్తం ఆపరేషన్లు అనంతనాగ్‌, పుల్వామా జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. అవంతిపొరలోని భద్రతా దళాల క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి చేసేందుకు లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్‌ ముక్తార్‌ భట్‌ ఓ విదేశీ ఉగ్రవాది, మరో స్థానిక ఉగ్రవాదితో కలిసి సిద్ధమయ్యాడు. భద్రతా దళాలు ముందస్తుగా దాడి చేసి ఈ కుట్రను భగ్నం చేశాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో భట్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఏకే-56, పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ముక్తార్‌ భట్‌ గతంలో ఓ సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది హత్యలో నిందితుడు. ఇతడిపై పలు నేరాభియోగాలు ఉన్నాయి. భద్రతా దళాలకు కశ్మీర్‌లో ఇది పెద్ద విజయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version