కాంగ్రెస్ పార్టీలోకి కత్తి కార్తీక ?

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా, టీపీసీసీ గా రేవంత్‌ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార పార్టీలోకి చేరికలు చాలా వరక తగ్గి.. కాంగ్రెస్‌ బాట పడుతున్నారు నాయకులు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ని కలిసారు కత్తి కార్తీక. ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కీ గౌడ్ నియమితులైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కత్తి కార్తీక.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కత్తి కార్తీకను ఆహ్వానించారు మధుయాష్కీ. అయితే.. ఈ ఆఫర్‌ పై సుముఖత వ్యక్తం చేసారు కత్తి కార్తీక. అంతేకాదు కత్తి కార్తీక చేరిక అంశం పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కూడా మధుయాష్కీ చర్చించినట్లు సమాచారం అందుతోంది.  బీసీ మహిళ, తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలైన కత్తి కార్తీకను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి కూడా అన్నట్లు సమాచారం అందుతోంది. కాగా… ఇక ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక పోటీ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version