5 గంటలుగా విచారణ.. KCRతో భేటీ కానున్న కవిత!

-

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. నేడు హైదరాబాదులో కవిత నివాసానికి చేరుకున్న 11 మంది సభ్యుల సీబీఐ బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. అయితే… ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభియోగాలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై గత 5 గంటలుగా సీబీఐ విచారణ కొనసాగుతోంది.

కవిత ఇంటికి ఉదయం 11 గంటలకు చేరుకున్న సీబీఐ అధికారులు ఆమెను ఇంకా ప్రశ్నిస్తున్నారు. స్కాంలో 9వ నిందితుడుగా ఉన్న అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అరోరాతో ఉన్న సంబంధాలు, ఆర్థికపర లావాదేవీలపై వివరాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత..గతంలో ఆమె వాడిన ఫోన్లు వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. రూ. 100 కోట్లు అరోరా నుంచి విజయ నాయర్‌కు బదిలీ అయిన వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిసింది. సూర్యాస్తమయం వరకు విచారణ కొనసాగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్లో సీఎం KCRతో భేటీ కానున్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version