కవిత మెగా రౌడీ, లిక్కర్ రాణి.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

-

బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ కవితపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఒక మెగా రౌడీ అని.. లిక్కర్ రాణి అని చురకలాంటించారు. శనివారం రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కవిత వివాదాస్పద పోస్ట్ పెట్టారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం అంటూ సెటైర్లు వేశారు.మోసపూరిత హామీలు అలాగే అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచిన రాహుల్ గాంధీకి సుస్వాగతం అంటూ ధ్వజమెత్తారు.

కవిత చేసిన ఈ పోస్ట్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. కల్వకుంట్ల కవిత వాళ్ళ.. నాన్నతో తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని చురకలంటించారు.లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు.తనను తాను ఒక మెగా రౌడీ అని చెప్పుకొని తిరుగుతున్న కవిత.. రాహుల్ గాంధీపై మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లోని భూముల అమ్మకాల లెక్కలపై కవిత స్పందించాలని టీపీసీసీ చీఫ్ చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news