మహారాష్ట్ర అభివృద్ధిలో BRS భాగస్వామ్యం అవుతుంది – కల్వకుంట్ల కవిత

-

మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబయిలో , మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక సంగీతం, డోలు చప్పుడు తో కార్యక్రమ వేదిక మార్మోగింది.

తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని , ముఖ్యంగా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ చర్చ నడుస్తుందని తెలిపారు. తెలంగాణతో దాదాపు 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని, తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించి తెలంగాణలో చేస్తున్న పనులను చేయాలని అక్కడి ప్రజల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి ప్రజలు అనేక విజ్ఞప్తులు చేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version