కేసీఆర్ తో కేకే భేటీ..!

-

లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో ఇంకో సంచలన పరిణామం చోటు చేసుకోబోతుంది. పార్టీ సీనియర్ నేత గులాబీ బాస్ కి నమ్మినబంటు కేశవరావు బీఆర్ఎస్ ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు ప్రచారం సాగుతుంది ఈ క్రమంలో రాజకీయ నిర్ణయం మీద బుధవారం కుటుంబ సభ్యులతో కేకే భేటీ అయినట్లు తెలుస్తోంది మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ కాబోతున్నారని టాక్ అయితే వస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో తనకి గౌరవం దక్కిందని కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని ఇప్పుడు సొంత పార్టీ కి వెళ్తే తప్పేముందని కేకే తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది మరి ఈ వార్తలు లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది కొన్ని మీడియా కథనాలు ఆధారంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి వాస్తవం ఏంటో తెలియదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version