కొనకపోతే బీజేపీ ఆఫీసు పై బియ్యం పారబోస్తాం :కేసీఆర్

-

తెలంగాణలో పండించిన వరి కొంటారా కొనరా అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒకటే మాట సాదా సీదాగా చెప్పాలని అన్నారు. రైతులు ఏడాది కాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం తన విధానాలను మర్చిపోకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు… కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ఇంగితజ్ఞానం కేంద్రానికి లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు యుద్ధం మొదలైంది కేసీఆర్ అన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి డ్రామాలు చేస్తున్నారని…. రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మెడలు వంచి కొనిపిస్తమంటున్నారు…కొనే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నించారు. చేతులు జోడించి వేడుకున్నా మీరు కొనకపోతే మీ బీజేపీ ఆఫీస్ మీద బియ్యం పారబొస్తాం అంటూ హెచ్చరించారు. మీకు మేము భయపడం టిఆర్ఎస్ రైతుల సమస్యల మీద లీడ్ తీసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మిమ్మల్ని వదలం చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతాం అంటూ కేసీఆర్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version