కేసీఆర్ యూటర్న్ పాలిటిక్స్… ఏది చెప్పిన నమ్మేస్తారా?

-

తెలంగాణ సీఎం కేసీఆర్ యూటర్న్ పాలిటిక్స్ బాగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. పూటకో మాట…రోజుకో బాట అన్నట్లు కేసీఆర్ తీరు ఉంటుంది. ఈ రోజు ఒక మాట మాట్లాడితే…రేపు ఇంకో మాట. అప్పుడేమో కేంద్రంతో సఖ్యతగా ఉండాలి అంటారు..ఇప్పుడేమో యుద్ధం చేద్దమంటారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు ముందు మద్ధతు ఇస్తారు…తర్వాత అవోక చట్టాలేనా…అవి వేస్ట్ చట్టాలు అంటారు.

kcr

అసలు ఆ చట్టాలు ఉత్తమమని ఒకసారి మాట్లాడతారు…మరొకసారి ఏమో సాగు చట్టాలు తేనె పూసిన కత్తులని అంటారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు అంశంపై కూడా కేసీఆర్ అదేవిధంగా యూటర్న్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతుల దగ్గర ఒక గింజ వదలకుండా కొంటామని మొన్నటివరకు మాట్లాడారు…ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటుందా లేదా? అని వాదిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ ఆంక్షలను అధిగమించి న్యాయం చేస్తామని, గింజ కూడా బయట అమ్మొద్దని, ఊర్లకొచ్చి కొంటామని రైతులకు చల్లని కబుర్లు చెప్పారు.

ఆ తర్వాత ఏమో పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, రైస్‌మిల్లరో, దాల్‌మిల్లరో అసలే కాదని, కొనుగోళ్లు, అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదని మాట్లాడుతున్నారు. అంటే అసలు పొంతన లేకుండా మాట్లాడటం కేసీఆర్‌కే చెల్లు అని చెప్పొచ్చు.

ఇక నియంత్రిత సాగు విధానం ఉండబోదని.. రైతులు ఏ పంటలు వేయాలనే విషయమై వారే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌ గతేడాది చివరిలో ఒక సమీక్షా సమావేశంలో చెప్పారు. కానీ.. గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం వరి సాగుపై అనధికారిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. అలాగే కేసీఆరే..వరి వేస్తే ఉరే అన్నట్లు మాట్లాడారు. వరిసాగుకు వ్యతిరేకంగా అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో తెలిసిందే.

చివరిగా ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌పై ఒకప్పుడు నిషేధం విధించిన ఇదే కేసీఆర్.. ఇప్పుడు అక్కడే ధర్నాకు దిగడం కేసీఆర్‌ మార్కు యూటర్న్‌లకు ఉదాహరణ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version