దుబ్బాక ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు..దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని..విజయం మాదే..నియోజక వర్గ ప్రజలు చాలా క్లియర్‌గా ఉన్నారని. ఉప ఎన్నిక టీఆర్ఎస్కు పెద్ద లెక్కేకాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు..నిన్నమేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
దుబ్బాక ఎన్నికల్లో చాలా రాజకీయ పార్టీలు అనేక అపోహాలు సృష్టిస్తున్నారని అయినప్పటికి టీఆర్ఎస్ గెలును ఎవరు అడ్డుకోలేరని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు..దుబ్బాకలో రాజకీయ ఘర్షణలు పెరగడం..బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో డబ్బు పట్టుబడిన వ్యవహారం రాజకీయంగా వేడిని పుట్టించడంపై కొందరు ప్రశ్నించగా సీఎం సమాధానమిచ్చారు. దుబ్బాకలో మంచి మెజారిటీతో గెలుస్తామాని..
కాంగ్రెస్, బీజేపీ గెలుపు కోసం చాలానే కష్టపడుతున్నారు..మొదట్లో దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్న..ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నాయకత్వంలో దూకుడు తగ్గినట్లు కనిపిస్తుంది..మండలాల వారిగా ఇంచార్జులను నియమించినప్పటికి..నాయకత్వంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది..ఎవరి మండలానికి వారు పరిమితం అవుతున్నారు తప్ప ఉమ్మడిగా ప్రచారం నిర్వహించటంలో వెనుకబడిపోతున్నారు..దీంతో పార్టీ కార్యకర్తలు అందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది..స్థానిక నాయకత్వానికి కాంగ్రెస్ జాతీయ కమిటీకి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది..
మరోవైపు బీజేపీ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తుంది..ఎట్టి పరిస్థితిలో దుబ్బాక గెలిచి తమ ఉనికి మరోసారి చాటుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కమలం పార్టీ..ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీకి కేంద్ర నాయకత్వం..డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు వంటి వారు ప్రచారంలో పాల్గొనడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సహం పెరిగింది..రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కూడా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక కావడంతో గెలుపుపై సీరియస్‌గా దృష్టి పెట్టారు..గెలుపు కోసం కలిసివచ్చే అన్ని అవకాశాలను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు..
టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు..ప్రభుత్వ లోపాలపై ప్రజల్లో నిలదీస్తున్నారు..అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు విధానం కొన్ని సార్లు పార్టీని ఇబ్బందిపెట్టేలా ఉంది..బీడి కార్మికుల ఫించన్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీకి కలిసివచ్చినట్లు కనిపిస్తుంది..బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బందువుల ఇంట్లో పోలీసుల సోదాలు..బీజేపీ నేతలు చేసిన రాద్దాంతం..తర్వాత సీపీ మీడియా సమావేశంతో బీజేపీ కొంత ప్రతికూలంగా మారినట్లు తెలుస్తుంది..ఎన్నికల ప్రచారంలో ఇలా ప్రవర్తించిన నేతలు, కార్యకర్తల తీరులో ప్రజల్లో వ్యతిరేక భావనకలిగినట్లు కనిపిస్తుంది..ఏదీ ఎమైనా దుబ్బాక ఉప ఉన్నిక ఇప్పడు రాష్ట్రంలో రాజకీయంగా హీట్‌ను పెంచుంది..రాజకీయ పార్టీలు గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు..నవంబర్ 3న పార్టీల నేతల భవిషత్ బ్యాలెట్ బ్యాక్స్ పెట్టనున్నారు దుబ్బాక ప్రజలు.